శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (11:36 IST)

భారీ వర్షాలు - తెలంగాణాలో వివిధ పరీక్షలు వాయిదా

గులాబ్ తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణా రాష్ట్రంలో మరింత విస్తృతంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి సబితారెడ్డి సూచించారు. 
 
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు 040-23230817నంబరులో సంప్రదించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ సూచించారు. సాయం అవసరమైన ప్రజలు 9492409781 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
 
అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తెచ్చారు. సైబరాబాద్‌: 94906 17100, 83310 13206, 040-27853413, 040-27853412, రాచకొండ: 9490617111, టోల్‌ఫ్రీ నంబర్‌: 1912 అనే నంబరులో సంప్రదించాలని కోరారు.