మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (10:34 IST)

అక్టోబరు 30న హుజురాబాద్ - బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30వ తేదీ హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా అక్టోబరు 30న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. 
 
నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు... ఆ వెంటనే ఫలితాలు వెలువడనున్నాయి.