టార్గెట్ హుజూరాబాద్.... మరో రూ.500 కోట్ల దళిత బంధు నిధులు!
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ టెర్గెట్ ఇపుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక. అందుకే ఆ నియోజకవర్గానికి నిధులు కుమ్మరిస్తున్నారు. తాజాగా మరో 500 కోట్ల రూపాయల దళిత బంధు నిధులు విడుదల చేశారంటే... పొలిటికల్ హీట్ ఎంతగా ఉందో అర్ధం అవుతోంది.
దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్లతో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టు కు మొత్తం రూ.1,000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, వారం రోజుల్లోపు మరో రూ.1,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దాంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.
ఈ నిధుల దెబ్బకి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులందరికీ కుటుంబానికి ఒక్కొకరికీ పదేసి లక్షల రూపాయలు వ్యాపారానికి విడుదల అవుతాయి. దీనితో లబ్ధిదారులు మారు మాట్లాడకుండా, ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. నే బలంగా బలపరుస్తారని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. దటీజ్ ఎలక్షన్ పాలిట్రిక్స్!