మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:45 IST)

రేపు తెలంగాణలో సెలవు

గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. 
 
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళవారం (28.9.2021 )సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 
 
ముఖ్యమంత్రి ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సి.ఎస్. ఆదేశించారు.

అయితే అత్యవసర శాఖలైన రెవిన్యూ పోలీస్ ఫైర్ సర్వీసులు మున్సిపల్ పంచాయతీ రాజ్ నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని భారీ వర్షాల వాళ్ళ ఏవిధమైన ఆస్తి ప్రాణనష్టం లేకుండా చూడాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ తెలియ చేశారు.