సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (12:18 IST)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న సమావేశమైన ఉభయ సభలు ప్రారంభమం అయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించిన అనంతరం సభలు వాయిదా పడ్డాయి. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను ఇవాళ సభలో సమర్పించనున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉభయ సభలకు సమర్పిస్తారు. 
 
తెలంగాణ హౌసింగ్ బోర్డు బిల్లు, కొండాలక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనిర్సిటీ సవరణ బిల్లు సభ ముందుకు రానున్నాయి. అలాగే పంచాయితీ రాజ్ సవరణ బిల్లు, నల్సార్ యూనివర్సి సవరణ బిల్లు కూడా సభలో ప్రస్తావించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత ఐటీ పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై అసెంబ్లీలో చర్చ జరగనునంది.
 
ఇక అసెంబ్లీని గౌరవంగా నడిపించాలని స్పీకర్‌ను కోరిన కేసీఆర్‌… ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధిపై చర్చించేలా సభను ఆర్డర్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్థవంతమైన చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని ఇప్పటికే బీఏసీ సమావేశంలో సూచించారు. అయితే హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో… టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు అసెంబ్లీని వేదికగా వాడుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. 
 
విపక్షాలు వ్యక్తిగత మైలేజీ కోసమే పాకులాడితే… వారికి గట్టిగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సభ్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 8 రోజులపాటు జరగనున్నాయి. ఈ సెషన్‌లో ప్రభుత్వం ఏడు బిల్లుల్ని ఆమోదించనుంది.