సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:04 IST)

తెలంగాణ పర్వతారోహకుడుకి ఏపీ సీఎం జగన్ ఆర్థిక సాయం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. తుకారామ్ సాహసాలను మెచ్చుకున్న జగన్… అతనికి భారీ ఆర్థికసాయాన్ని అందించారు.
 
శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను తుకారామ్ కలిశాడు. తన పర్వతారోహణ వివరాలను సీఎంకు వివరించాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను జగన్ అభినందించారు. 
 
ఆయనకు రూ.35 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా తుకారామ్ మాట్లాడుతూ, తనపై జగన్ చూపిన ఆదరాభిమానాలకు, చేసిన ఆర్థిక సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.