శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:56 IST)

చెరువులో శవమై తేలిన తల్లీకూతుళ్లు.. ఎక్కడ?

ఆ తల్లీకూతుళ్లకు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదుగానీ చెరువులో శవమై తేలారు. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని నారాయణ పేట జిల్లాలో జరిగింది. తాజగాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో తల్లి కుమార్తెలు శవమై కనిపించారు. అనుమానాస్పదస్థితిలో రెండేళ్ల బిడ్డతో సహా తల్లి మృతి చెందింది. ఇద్దరు మృతదేహాలు గ్రామశివారులోని చెరువులో కనిపించడంతో తీవ్ర కలకలం రేపుతోంది. 
 
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు వారిది ఆత్మహత్య లేదా హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.