1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 62 Year Old Woman killed by Son in Vikarabad

పరిగిలో అమ్మను చంపేసిన కొడుకు.. ఎందుకో తెలుసా

Mother
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం ఖుదావాన్‌పూర్‌లో దారుణం జ‌రిగింది. ప్రభుత్వం ఇచ్చే పింఛ‌ను డ‌బ్బుల కోసం త‌ల్లిని చంపాడో కిరాతక కొడుకు. నవమాసాలు పెంచిన కన్న తల్లి భీమ‌మ్మ‌(62) గొంతును విద్యుత్ తీగ‌తో నులిమి హ‌త్య చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బ‌ల‌వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హస్తినలో తొలి నేషనల్ కో-ఆపరేషన్ సమ్మిట్ - 8 కోట్ల మందితో అమిత్ షా కాన్ఫరెన్స్