గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: ఆదివారం, 31 అక్టోబరు 2021 (18:48 IST)

01-11-2021 నుంచి 30-11-2021 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని విధాలా శుభదాయకమే. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ధనానికి లోటు వుండదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. జాతక పొంతన ప్రధానం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి ఫథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.

 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది వుండదు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. వేడకల్లో అత్యుత్సాహం తగదు.

 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
బుద్ధిబలంతో రాణిస్తారు. మీ వితరణ ఆదర్శప్రాయమవుతుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్లుగా ప్రణాళికులు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు . పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. మ శ్రీమితి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం.

 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఆప్తులపై మీ వ్యాఖ్యలు సత్ర్పభావం చూపుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతకపొంతన ప్రధానం. మధ్యవర్తుల జోలిక పోవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. పందాల జోలికి పోవద్దు.

 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ధనలాభం వుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. పరిచయం లేనివారితో జాగ్రత్త. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య అరమరికలు తగదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. దైవకార్యాలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. 

 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. మనస్థిమితం వుండదు. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు అనివార్యం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అస్వస్థతకు లోనవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా వుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదామార్పు. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి.

 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనుకోని సంఘటలు ఎదురవుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. సన్నిహితులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఈ ప్రతికూలతలు తాత్కాలికమే. ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఒక ఆహ్వానం సందిగ్దానికి గురి చేస్తుంది. ఉద్యోగ బాధ్యత్లో జాగ్రత్త వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకునిల్వ తగదు. వన సమారాధనలు, వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు.

 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడుకలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆప్తుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు చేస్తారు.

 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు భారమనిపించవు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. హామీలు నిలబెట్టుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సన్నిహితులు స్వయంగా చూసుకోవాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సన్నిహితుల ద్వారా తెలియజేయండి. సంతానం ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. మీ ఆగ్రహావేశాలు అదుపులో వుంచుకోండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.

 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయం అంతంతమాత్రమే. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల మధ్య సఖ్యత లోపం. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రవాణా, సాంకేతక సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం పిల్లలకివ్వవద్దు.