గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: శుక్రవారం, 1 అక్టోబరు 2021 (00:04 IST)

1-10-2021 నుంచి 31-10-2021 వరకూ రాశి ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆర్థికంగా బాగున్నా సంతృప్తి వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారాలతో తీరిక వుండదు. బాధ్యతగా మెలగాలి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా వుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పదవుల కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. వ్యాపారాభివృద్దికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అదుపులో వుండవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. తలపెట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల హితవు ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. చేతివృత్తులు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారంలో జయం, ధనలాభం వున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వేడుకగా సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. సంతానం చదువలపై దృష్టి పెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన వ్యాపారాలకు అనుకూలం. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం అనుకూలదాయకం. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవివాహిలకు శుభవార్తా శ్రవణం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మానసికంగా కుదుటపడతారు. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ఉపాధ్యాయులకు పదోన్నతి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు. వ్యాపారాల్లో గణనీయమైన అభివృద్ధి కానవస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శస్తారు.
 
సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్నింటా మీదే పైచేయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభసూచికం. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకి గురవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పనులు చేపడతారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం, దైవదర్శనాల్లో ఒకింత అవస్తలు తప్పవు.
 
కన్యారాశి: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ద్వితీయార్థం ఆశాజనకం. రుణ వేధింపులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. కానుకలు, అభినందనలు అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలన ఆత్మీయుల ద్వారా తెలియజేయండి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తికాగలవు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా  ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వాయిదా పడుతున్న వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం పైచదువులపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ సమర్థత మరొకరికి లాభిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాల సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. ఉపాధి అవకాసాలు కలిసివస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం పైచదువులపై మరింత శ్రద్ధ అవసరం. పోగొట్టుకున్న పత్రాలు అతి కష్టమ్మీద సంపాదిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.