శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (22:23 IST)

దస‌రా కానుకగా అక్టోబ‌ర్ 15, 2021న 4 భాషల్లో అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్‌బాల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌కి స్వ‌ర్ణ‌యుగ‌మైన 1952-62 మ‌ధ్య కాలానికి సంబంధించిన క‌థ‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.
 
ఇప్ప‌టికే చిత్ర బృందం విడుదల చేసిన మైదాన్ పోస్టర్స్ ఆడియ‌న్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ - ``ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌పై చూడ‌ని ఒక స్పూర్తివంత‌మైన క‌థ‌తో ప్రతి భారతీయుడు గర్వపడేలా మైదాన్ చిత్రం ఉంటుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15, 2021న మైదాన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం`` అన్నారు.
 
నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్‌ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.