శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (14:10 IST)

కంగనా రనౌత్ ఒక్క సినిమాలో నటించి రాణి లక్ష్మీ‌బాయ్‌ని అనుకుంటే ఎలా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం అనంతరం ఆమె మరింత దూకుడు పెంచారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటుగా పలువురు బాలీవుడు ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. కంగనా కార్యాలయం కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై కంగనై బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో కంగనా రనౌత్‌పై నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యాస్త్రాలు సాధించారు. సోషల్ మీడియాలో #justasking పేరుతో వర్తమాన అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రకాశ్‌రాజ్... తాజాగా కంగనాపై సెటైర్లు వేశారు. 
 
"ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలానే ఆలోచించాలా" అంటూ సంబంధిత ఫొటోలను ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.