సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:24 IST)

బాల్ ఠాక్రే భయపడినట్టే జరిగింది.. కంగనా ఘాటు విమర్శలు

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే భయపడినట్టే ఇపుడు ముంబైలో జరిగిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ముంబైలోని తన కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 
 
తాజాగా బాల్ ఠాక్రేకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి మ‌రోసారి ఆ పార్టీపై విమ‌ర్శలు గుప్పించింది. త‌న ఫేవ‌రెట్ ఐకాన్ల‌లో ఒక‌రైన బాలా సాహెబ్ ఠాక్రే గ‌తంలో చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నాన‌ని ఆమె తెలిపింది.
 
కాంగ్రెస్ కూట‌మిలో ఏదో ఒక‌రోజు శివ‌సేన క‌ల‌వాల్సి వ‌స్తుందేమోన‌న్న‌దే త‌నకున్న భ‌యమ‌ని బాల్ థాక‌రే అన్నార‌ని ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం త‌న శివ‌సేన పార్టీ ప‌రిస్థితిని చూస్తే ఆయ‌న ఆత్మ‌ ఏ విధంగా ఫీల్ అవుతుందోన‌ని ఆమె ట్వీట్ చేసింది. 
 
కాగా, ఇటీవ‌లే ఆమె శివ‌సేనను సోనియా సేన‌గా అభివ‌ర్ణించి విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌పై ఆమె మండిప‌డుతోంది.
 
అలాగే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఆమె వదిలిపెట్టలేదు. "ప్రియమైన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీగారు.. ఓ మహిళగా ఉండి మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుగున్న ఇబ్బందులు చూసి వేదన కలగడం లేదా! అంబేద్కర్‌గారు మనకు ఇచ్చిన రాజ్యాంగంలోని సూత్రాలను పాటించాలని మీ ప్రభుత్వానికి మీరు సూచించలేరా? విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం ఇండియాలో నివస్తున్నారు. 
 
మీ నిశ్శబ్దాన్ని, అసమాన్యతను చరిత్ర నిర్ణయిస్తుంది. మొత్తం లా అండ్‌ ఆర్డర్‌ను ఉపయోగించి మీ ప్రభుత్వం ఓ మహిళను ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు జోక్యం చేసుకుంటారని భావిస్తున్నాను. శివసేన వ్యవస్థాపకులు బాల్‌ ఠాక్రే నాకెంతో ఇష్టమైన, ఆరాధ్యమైన వ్యక్తి. ఏదో ఒకరోజు శివసేన పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో గ్రూపు కడుతుందేమోనని ఫీల్‌ అయ్యారు. ఆయన అప్పుడు ఫీల్‌ అయిన విషయమే ఇప్పుడు శివసేన పార్టీలో కనిపిస్తోంది" అంటూ కంగనా అటు సోనియా గాంధీని, శివసేన ప్రభుత్వాన్ని దయ్యబట్టారు.