ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (19:22 IST)

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర ఇదేనా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ - రణం రౌద్రం రుధిరం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు కాగా, అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లు. అయితే, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన వార్త ఒకటి లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ చక్కర్లు కొడుతున్న గాసిప్ ప్రకారం ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీంకు అజయ్‌ దేవగన్‌ మెంటర్‌గా వ్యవహరిస్తారట. అంటే, వారిద్దరికీ విద్య నేర్పించే గురువుగా ఉంటారట. ఇది ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుందట. ఈ పాత్రలో అజయ్‌ కనిపించనున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
కాగా, ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుగగా, ఇందులో అజయ్ దేవగన్ 10 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. షూటింగ్‌ మొదలవగానే అజయ్‌దేవ్‌గన్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం.