గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:34 IST)

26-09-2021 నుంచి 02-10-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

Weekly Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రణాళికలు వేసుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సోమ, బుధ వారాల్లో పనులు సాగవు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతి తోడ్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం, పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సమయానికి సన్నిహితులు సహకరిస్తారు. మానసికంగా కుదుటపడతారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. అది, మంగళవారాల్లో బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కాంట్రాక్టర్లు, ఏజెంట్లకు కష్టకాలం. వృత్తుల వారికి సామాన్యం.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఉపాధ్యాయులకు శుభవార్తా శ్రవణం, రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. శనివారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ధనం మితంగా వ్యయం చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంస్థల స్థాపనలకు సమయం కాదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. సంతానం పై చదువులపై దృష్టి పెట్టండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము
సర్వతా అనుకూలదాయకమే. వాగ్దాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రతిపాదనలు ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో ఊహించని ఇబ్బందులెదురవుతాయి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కన్య: ఉత్తర 2 3, 4 పాదములు, హస్త చిత్త 1, 2 పాదములు
ఓర్పుతో వ్యవహరించాలి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పత్రాలు అందుకుంటారు. అది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ విద్యాసంస్థలకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలు పెట్టినా మొదటికే వస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. గురు, శని వారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన లోపం. ప్రతి చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. రిటైర్డు ఉద్యోగస్తులకు నిరుత్సాహకరం. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. త్వరలో శుభవార్త వింటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. దంపతుల మధ్య సఖ్యత లోపం. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి,
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1234 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు చేజారిపోతాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలవదు. ధనసహాయం అర్ధించి భంగపడతారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆది, గురు వారాల్లో సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్మాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం ఆశాజనకం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన కుదురుతుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తుల సలహా పాటించండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల రెన్యువలో మెలకువ వహించండి. పెట్టుబడులకు తరుణం కాదు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు చేజారిపోతాయి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రియల్టర్లు, బిల్డర్లకు కష్టకాలం. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు.