బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (09:36 IST)

15-08-2021 నుంచి 21-08-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
అనుకున్నది సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు. సోమ, బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో వుండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహం సందడిగా ఉంటుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో ఊహించని సమస్యలెదురవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రియుతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనం పిల్లలకు ఇవ్వవద్దు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో వ్యవహరించండి. త్వరలో శుభవార్త వింటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు పదవీ యోగం. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సోమ, గురువారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉపాధ్యాయులకు శుభయోగం. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మనస్సు కుదుటపడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన లోపం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పోయిన వస్తువులు లభ్యం కావు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, వెండి వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి పురోభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ పని తలపెట్టినా మళ్లీ మొదటికి వస్తుంది. ఆలోచనలు నిలకడగా వుండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆదాయానికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆది, శనివారాల్లో ప్రతికూలతలు అధికం. పట్టుదలతో ముందుకు సాగండి. సలహాలు, సాయం ఆశించవద్దు. అనవసర జోక్యం తగదు. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వేడుకకు హాజరవుతారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉపాధ్యాయులకు స్థానచలనం. కొత్త పథకాలు చేపడతారు. పరిచయాలు బలపడతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగబాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఈ వారం ఆశాజనకం. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. నగదు, స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు పదవీయోగం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వెండి, బంగారు వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
మీ మాటే నెగ్గాలనే పట్టుదల తగదు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించి భంగపడతారు, ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆది, సోమవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో  సంప్రదింపులు జరుపుతారు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు గృహమార్పు చికాకుపరుస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు లోటుండదు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. గృహనిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. అధికారులకు ధన ప్రలోభవం తగదు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.