ఆగస్టు 14ను ఇలా జరుపుకుందాం: పిలుపునిచ్చిన మోదీ
ప్రజల కష్టాలు, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
కాగా.. దేశ చరిత్రలో ఆగస్టు 14వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.