గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:53 IST)

జియోమార్ట్-స్మార్ట్‎స్టోర్ అందిస్తున్న ఫుల్ పైసా వసూల్ అమ్మకం

జియోమార్ట్ మరియు స్మార్ట్‎స్టోర్ సంయుక్తంగా భారతదేశపు అతిపెద్ద మరియు ఎంతగానో ఎదురుచూస్తున్న కిరాణా అమ్మకం పండుగ, ఫుల్ పైసా వసూల్ అమ్మకంను ఆగస్ట్ 14న జియోమార్ట్ పైన ప్రారంభిస్తున్నాయి. ఈ అమ్మకం ఆగస్ట్ 18 వరకు ఉంటుంది. స్మార్ట్ సూపర్‎స్టోర్స్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్‌తో సహా 1200+ప్లస్ దుకాణాల నెట్వర్క్ అంతటా ఉంటుంది.
 
వినియోగదారులకు కిరాణా యొక్క సంపూర్ణ శ్రేణిపై భారీ పొదుపును అందించడమే ఫుల్ పైసా వసూల్ అమ్మకం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరము కూడా, స్టేపుల్స్, ప్యాక్డ్ ఆహారము, గృహ మరియు వ్యక్తిగత సంరక్షణ, పాల ఉత్పత్తులు, జనరల్ మర్కండైజ్ మరియు ప్రముఖ బ్రాండ్స్ యొక్క దుస్తులపై ఈ అమ్మకం సాటిలేని డిస్కౌంట్లను అందిస్తోంది.
 
బిస్కెట్లు, చాక్లెట్లు మరియు షాంపూలపై 50% వరకు డిస్కౌంట్లు అందించబడుతున్నాయి. శీతల-పానీయాలు, టూత్‎పేస్ట్, నూడిల్స్ మరియు సబ్బులపై 33% వరకు కనీస డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే డిటర్జెంట్ శ్రేణిపై 30% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. 1,470 ఎంఆర్‎పి ఉన్న బాస్మతి బియ్యము మరియు నూనె యొక్క కాంబో కేవలం రూ.1,049కే కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు తమకు నచ్చిన వస్తువుల కొరకు జియోమార్ట్ యాప్ పైన ఆర్డర్ చేయవచ్చు. వాటిని ఉచితంగా తమ ఇంటి వద్ద అందుకోవచ్చు. మరింత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ఉచిత డెలివరీ సేవల కొరకు కనీస ఆర్డర్ పరిమితి లేదు.
 
ఫుల్ పైసా వసూల్ అమ్మకం లైవ్‌గా మరియు వినోదభరితంగా ఉన్న ప్రకటనల క్యాంపెయిన్ కొరకు కూడా పేరుగాంచింది. ఈ సంవత్సరం, ఈ అమ్మకం క్యాంపెయిన్‌లో నక్షత్ర తారాగణాన్ని చూడవచ్చు, వీరిలో సతీష్ షా, కేతకి దావే, శుభాంగి ఆత్రే, ముకుల్ చద్దా, ఆశ్లేష ఠాకుర్ మరియు తనిష్క్ ఉన్నారు. ఇది టెలివిజన్, రేడియో, ముద్రణ, ఆన్లైన్, సోషల్ మీడియా మరియు ఓఓహెచ్ వంటి ప్రధాన మాధ్యమ వేదికలపై లైవ్ గా ఉంటుంది మరియు ఈ అమ్మకం పూర్తి కాలపరిమితి వరకు ఉంటుంది.