ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 ఆగస్టు 2021 (23:20 IST)

వాల్యూ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓను విడుదల చేయనున్న కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌

కెనరా రొబెకో ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌  తమ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ), కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌ ఇది. ఇది వాల్యూ ఇన్వెస్‌మెంట్‌ వ్యూహాన్ని అనుసరించడంతో పాటుగా తమ ఇంట్రిన్సిక్‌ విలువల కన్నా తక్కువ ధరలకు వాణిజ్యం నెరవేర్చుతున్న వ్యాపారాలలో  విలువ పెట్టుబడుల వ్యూహం అనుసరిస్తుంది మరియు భవిష్యత్‌లో అవి తమ అసలైన విలువను అందిస్తాయని భావిస్తున్నారు.
 
ఈ నూతన పథకం, కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌, అత్యుత్తమంగా తగిన వాల్యూయేషన్‌ సాంకేతికతను వినియోగిస్తుంది. కంపెనీ యొక్క నికర విలువను చేరుకోవడానికి పలు ఆర్థిక పారామీటర్‌లతో పాటుగా వాల్యుయేషన్‌ సాంకేతికతల ఆధారంగా, తక్కువ విలువలు కలిగిన వ్యాపారాలను గుర్తించి, ఎంపిక చేస్తుంది. కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ ఆ తరువాత పోర్ట్‌ఫోలియోను ఆపర్ట్యునిటీ పరిమాణం మరియు పోర్ట్‌ఫోలియో కోసం నిర్వచించిన రిస్క్‌ పరిమితులు దృష్టిలో పెట్టుకుని పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తుంది. ఈ పోర్ట్‌ఫోలియో నిర్మాణ ప్రక్రియకు పలు అంతర్గత క్వాంట్‌ నమూనాలు సహాయపడతాయి. శక్తివంతమైన ఫండమెంటల్స్‌ కారణంగా బాగా పనిచేసే అవకాశం ఉన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఇది ఉంటుంది.
 
కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌, ఈక్విటీలలో గణనీయమైన ఎక్స్‌పోజర్‌ను తీసుకుంటుంది మరియు తక్కువ విలువ కట్టబడిన కంపెనీలపై అధికంగా దృష్టిసారించి భారతీయ మార్కెట్‌లలో వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నుంచి దీర్ఘకాలిక మూలధన వృద్ధిని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెనరా రొబెకో వాల్యూఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ఆవిష్కరణ గురించి శ్రీ మోహిత్‌ భాటియా, హెడ్‌–సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ మరియు దేశీయ లిక్విడిటీ చేత మార్కెట్‌లు నడుపబడుతున్న కాలంలో  మా నూతన ఆఫరింగ్‌ కెనరా రొబెకో వాల్యూఫండ్‌ను  విడుదల చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.
 
వాల్యూ ఇన్వెస్టింగ్‌ అనేది నిరూపిత, కాలాతీత పెట్టుబడి వ్యూహంగా నిలువడంతో  పాటుగా అంతర్గత విలువ కంటే దిగువన వ్యాపారం చేసే వ్యాపార పోర్ట్‌ఫోలియోను గుర్తించడం ద్వారా అత్యధిక  భద్రత కలిగిన ఈ కంపెనీలు/వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక సంపదను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఆకర్షణీయమైన అప్‌సైడ్‌ పొటెన్షియల్‌తో ప్రయోజనకరమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో సృష్టించేటప్పుడు ఈ తప్పుడు ధరల అవకాశాల నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తుంది.
 
‘‘కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ ఈ తక్కువ విలువ కలిగిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఇవి సహేతుకమైన భద్రతను అందించడంతో పాటుగా డౌన్‌సైడ్‌ రిస్క్‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది’’ అని శ్రీ భాటియా అన్నారు. శ్రీ నిమేష్‌ చంద్రన్‌, హెడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, ఈక్విటీస్‌ మాట్లాడుతూ ‘‘చాలా వరకూ, వాల్యూ ఇన్వెస్టింగ్‌ గురించి నేను మదుపరులతో మాట్లాడినప్పుడు, వారు ఇప్పటికీ ప్రైస్‌ టు బుక్‌ లేదా ప్రైస్‌ టు ఎర్నింగ్‌ రేషియోలో కంపెనీ కొనుగోలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తారు.
 
లేదా వారు చక్కటి డివిడెండ్‌ రాబడి కోసం చూస్తుంటారు. కంపెనీ సాపేక్ష విలువలను అంచనా వేయడానికి ఇవి షార్ట్‌ కట్స్‌ అయితే, ఈ లక్షణాలపై ఆధారపడి అతి చవకైన కంపెనీలను కొనుగోలు చేయడం గురించిన విలువ పెట్టుబడి కాదు ఇది. విలువ పెట్టుబడి అనేది అత్యంత విస్తృతమైన సిద్ధాంతం. ఇది అంతర్గత విలువ కంటే తక్కువ ధరతో కంపెనీని కొనుగోలు చేయడంగా ఉంటుంది..’’అని అన్నారు.
 
ఈ నూతన స్కీమ్‌ కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ను శ్రీ విశాల్‌ మిశ్రా, ఫండ్‌ మేనేజర్‌- ఈక్విటీస్‌ నిర్వహించనున్నారు. శ్రీ మిశ్రా ప్రస్తుతం కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌, కెనరా రొబెకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరియు కెనరా రొబెకో బ్లూ చిప్‌ ఈక్విటీ ఫండ్‌లకు కో–ఫండ్‌ మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. చార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌ మరియు ముంబై యూనివర్శిటీ నుంచి కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన శ్రీ మిశ్రా, కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌ లో మే 2021లో చేరారు.
 
కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ను ఆగస్టు 13,2021 వ తేదీన తెరుస్తారు మరియు ఆగస్టు 27,2021వ తేదీన  మూసివేస్తారు. సెప్టెంబర్‌ 06, 2021 తేదీ నుంచి మరలా ఈ నూతన స్కీమ్‌ను పెట్టుబడుల కోసం తిరిగి తెరుస్తారు. ఈ ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి మొత్తం 5వేల రూపాయలు మరియు ఆ పైన 1 రూపాయి గుణిజాలతో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు మరియు నెలవారీ సిప్‌ 1000 రూపాయలు మరియు ఆపైన 1 రూపాయి గుణిజాలతో పెట్టుబడులు పెట్టవచ్చు.
కెనరా రొబెకో వాల్యూ ఫండ్‌ కోసం బెంచ్‌మార్క్‌గా ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ నిలువనుంది.