గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:43 IST)

లిథియం ఆయన్ బ్యాటరీ బిజినెస్‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. విద్యుత్ వాహనాల తయారీలో కీలకమైన లిథియం ఆయన్ బ్యాటరీ బిజినెస్‌లోకి అడుగు పెట్టనుంది. తద్వారా భారత్‌లో భారీ స్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. అమెరికాకు చెందిన సంస్థ అంబ్రీ ఇంక్ పరిశ్రమ ప్రతినిధులతో రిలయన్స్ టీమ్ చర్చలు జరుపుతుంది.
 
అందుకోసం అమెరికా కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 50 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేయనుంది రిలయన్స్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్‌). అంటే అంబ్రీలో 42.3 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయనుంది.
 
అలాగే అమెరికాలోని మాసాచ్చుసెట్స్ కేంద్రంగా అంబ్రీ ఇంక్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ కాల ఇంధన నిల్వ వ్యవస్థల్లో ఎదగడానికి వీలవుతుంది. పాల్‌సన్ అండ్ కో ఇంక్‌, బిల్ గేట్స్‌తో సహా కొందరు ఇన్వెస్టర్లతో కలిసి ఎనర్జీ స్టోరేజీ కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 144 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.