ప్రభాస్‌తో చాలా థ్రిల్లింగ్‌గా వుందంటున్న దీపికా పదుకునె
స్టార్ హీరో ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలలో నటిస్తూ ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారట. ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా మహానటి తరువాత నాగశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీపికా పదుకుణే ఈ సినిమా గురించి చెబుతూ ముందు రాబోయే వాటి గురించి ఆలోచిస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉందని కామెంట్స్ ఇచ్చారు.
ప్రముఖ దర్సకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేస్తున్నారట. ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొక వైపు హీరో ప్రభాస్, దర్సకుడు నాగ అశ్విన్ టైటిల్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారంటున్నారు సినీ విశ్లేషకులు.