గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (21:32 IST)

పాకిస్తాన్‌ను పడగొట్టిన 'బాహుబలి' ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ సరికొత్త సంచనాలను సృష్టించారు. మోస్ట్ హ్యాండ్‌సమ్ ఆసియా మెన్‌గా నిలిచాడు. పాకిస్థాన్, కొరియా, జపాన్ స్టార్లు కూడా ప్రభాస్ ముందు నిలవలేకపోయారు.
 
మోస్ట్ హ్యాండ్ సమ్, ఏసియా మిస్టర్ టైటిల్ దక్కించుకున్నారు ప్రభాస్. ఫ్యాన్సీ యాడ్ వెబ్ సైట్ ఈ జాబితాను విడుదల చేసింది. లుక్స్‌తో పాటు పాపులారిటీ ఆధారంగా ఈ జాబితాను సిద్థం చేశారు.
 
కొరియా, జపాన్ స్టార్లు పోటీలుపడ్డా బాహుబలి ప్రభాస్ మెన్స్ బాహుబలి మెన్ 2021గా నిలిచారు. బాహుబలితో ప్రభాస్ రేంజ్ పెరిగింది. సాహోతో మరో రేంజ్‌కు వెళ్ళాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా నిలిచాడు.
 
ఈ జాబితాలో ప్రభాస్ మాత్రమే టాప్ 5లో ఉన్న భారతీయ నటుడు. హైట్, వెయిట్‌తో పాటు అన్నింటిని లెక్కలోకి తీసుకున్నారు. పాకిస్థాన్ టీవీ నటుడు ఇమ్రాన్‌కు రెండవ స్థానం దక్కింది. పాకిస్థాన్ సీరియళ్ళలో ఇమ్రాన్ పేరు మారుమోగుతుంటుంది. ఇక మూడవ స్థానంలో జపాన్ స్టార్ జిన్ నిలిచారు. సౌత్ కొరియాస్టార్ కిమ్‌కు నాలుగోస్థానం దక్కింది.