సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (17:40 IST)

బెస్ట్ ఫ్రెండ్సే బ‌లం అంటోన్న అనుష్క

Anuksha BFF
స్వీటీ అని ముద్దుగా పిలుచుకునే అనుష్క శెట్టి తాజాగా ఫ్రెండ్ షిప్‌పై త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. దీనికి ఆమె అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. త‌న జీవితంలో వున్న బెస్ట్ ఫ్రెండ్ ఫొటోను కూ యాప్‌లో పోస్ట్ చేసింది. ఇంకా ఇది ఇప్పుడిప్పుడే ప్ర‌చారం పొందుతోంది. త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ కు అనుసంధానంగా ఆమె పెట్టిన పోస్ట్ కూ లోకూడా క‌నిపిస్తుంది. ఓ బిల్డింగ్ ట‌వ‌ర్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు స్నేహితుల‌తో క్లోజ్ షాట్‌లో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. అదేవిధంగా త‌న పెంపుడు కుక్క ప‌డుకున్న విధంగా తాను అలా ప‌డుకునే స్మైల్ చేస్తున్న పిక్ కూడా పెట్టింది.
 
Anuksha - petdog
స్వీటీ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయితే తాజాగా అనుష్క తన బిఎఫ్‌ఎఫ్‌ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) తో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘జీవితం గడుస్తున్న కొద్దీ మా మార్గాలు మారవచ్చు, కాని స్నేహితుల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది’ అని అనుష్క మంచి క్యాప్షన్ ఇచ్చారు. ఆమె పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు ప్రేమతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాప‌రంగా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో స్వీటీ ఇద్దరి కవల పిల్లలతో ఒంటరి తల్లిగా కనిపించనుందట. త్వ‌ర‌లోనే ఈ విష‌యాలు కూడా కూ లో తెల‌ప‌నుందని తెలుస్తోంది.