ఫాస్ట్ చార్జింగ్ కనెక్టర్‌ను తెరిచిన ఎథర్ ఎనర్జీ
భారతదేశపు మొట్టమొదటి తెలివైన విద్యుత్ స్కూటర్ తయారీదారు ఎథర్ ఎనర్జీ నేడు తమ సొంత చార్జింగ్ కనెక్టర్‌ను ఇతర ఓఈఎంలు తమ ద్విచక్రవాహనాల కోసం వినియోగించుకునేందుకు తగిన అవకాశాలను సైతం అందిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశవ్యాప్తంగా పరస్పర మార్పిడి చేసుకోగల ద్విచక్ర వాహన వేగవంతమైన చార్జింగ్ వేదికకు దారి వేసింది. ఇది కేవలం ఆందోళనను తొలగించడం మాత్రమే కాదు, అన్ని విద్యుత్ స్కూటర్లూ ఎథర్ ఎనర్జీ యొక్క 200కు పైగా ఫాస్ట్ చార్జర్స్‌ను వినియోగించుకునే అవకాశమూ కలుగుతుంది. అంతేకాదు, ఇతర ఓఈఎంలు సైతం సామాన్య ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను నిర్మించడం సాధ్యమవుతుంది. తద్వారా మౌలిక వసతుల పెట్టుబడులు సైతం తగ్గుతాయి.
ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడంలో అతి ప్రధానమైన చోధకునిగా విస్తృత శ్రేణి చార్జింగ్ మౌలిక వసతులు నిలుస్తాయి. వినియోగాన్ని గరిష్టం చేయడంతో పాటుగా చార్జింగ్ మౌలిక వసతుల సామర్థ్యం వృద్ధి చేయాలంటే, కామన్ కనెక్టర్స్ అవసరం కూడా ఉంది. విభిన్న ఉత్పత్తుల వ్యాప్తంగా దానిని వినియోగించుకునే రీతిలో ఉండాలి. ప్రారంభం నాటి నుంచి, ఎథర్ ఎనర్జీ తమ వేగవంతమైన చార్జింగ్ నెట్‌వర్క్, ఎథర్ గ్రిడ్‌ను నిర్మించేందుకు గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. దీనిద్వారా సాధారణ వేగంతో చార్జింగ్ అవకాశాలను అన్ని విద్యుత్ ద్విచక్రవాహనాలు మరియు నాలుగుచక్రాల వాహనాలకూ అందిస్తుంది.
ఎథర్ ఎనర్జీ యొక్క కనెక్టర్ సాంకేతికతను తెరువడమనేది, కామన్ కనెక్టర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఈవీ యజమానులంతా దేశవ్యాప్తంగా ఏదైనా ఫాస్ట్ చార్జింగ్ పరిష్కారాన్ని వినియోగించుకునేందుకు అనుమతిస్తుంది. అందువల్ల, భారతదేశంలో వేగవంతంగా ఈవీ స్వీకరణ జరిగేందుకు మొత్తం వ్యవస్ధ కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
ఫాస్ట్ చార్జింగ్ కోసం నూతన కనెక్టర్ ప్రమాణాల అవసరం
నాలుగు చక్రాల విద్యుత్ వాహనాలైనటువంటి చాడెమో, సీసీఎస్ మొదలైన వాటికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటే, చైనా మినహా మరే దేశంలోనూ ద్విచక్రవాహనాలకు సంబంధించి కనెక్టర్ ప్రమాణాలు లభ్యం కావడం లేదు. ద్విచక్రవాహనాల ఫాస్ట్ చార్జింగ్ అవసరాలు వినూత్నంగా ఉంటాయి. ద్విచక్ర వాహనాల ఆకృతి, పరిమాణం వంటివి నాలుగు చక్రాల వాహనాల చార్జింగ్ కనెక్టర్ స్వీకరణను కష్టతరం చేస్తుంది. అదే రీతిలో, అదే కనెక్టర్‌ను సాధారణ మరియు ఫాస్ట్ చార్జింగ్ కోసం వినియోగించడం జరుగుతుంది. భారతీయ రహదారి పర్యావరణ, ఉష్ణోగ్రత మరియు తేమ వాతావరణంకు తోడు, భద్రత మరియు యంత్రసామాగ్రి జీవితకాలానికి తగినట్లుగా తగిన క్షేత్రస్ధాయి పరిశోధనలతో కూడిన మరియు భారతీయ పరిస్థితులకు తగినట్లుగా ప్రామాణీకరణ డిజైన్‌తో కూడిన ప్రమాణాలూ అవసరం.
ఎథర్ డిజైన్ చేసిన ఈ కనెక్టర్‌లో ఏసీ మరియు డీసీ చార్జింగ్‌ను ఒకే కనెక్టర్‌తో చేసే అవకాశం ఉంది. ఈ కనెక్టర్ పరిణామాన్ని ద్విచక్రవాహనం మరియు మూడు చక్రాల వాహనాలతో సహా మిళితం అయ్యేలా రూపకల్పన చేశారు. కంట్రోల్ మరియు ప్రాక్సిమిటి పైలెట్‌తో కాన్ 2.0 కమ్యూనికేషన్ సామర్ధ్యం సైతం ఉంటుంది. చివరగా, అతి తక్కువ ఖర్చు వద్ద ఉత్పత్తి అయ్యేలా రూపకల్పన చేయడం వల్ల, భారీ విభాగపు వాహనాలలో సైతం వినియోగించేందుకు అనుమతిస్తుంది.
తరుణ్ మెహతా, కో–ఫౌండర్ అండ్ సీఈవో, ఎథర్ ఎనర్జీ మాట్లాడుతూ.. ఫేమ్ 2 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో విద్యుత్ ద్వి చక్రవాహనాలు ఇప్పుడు ప్రధాన స్రవంతిగా మారాయి. బహిరంగ ప్రదేశాలలో వేగవంతమైన చార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగదారులు కోరుకుంటున్నారు. ఆ అవసరాలను తీర్చడం కోసం మేము ఈ విభాగాన్ని నిర్మిస్తున్నాం. మా ప్రొప్రైయిటరీ చార్జింగ్ కనెక్టర్‌ను పంచుకోవడమనేది కామన్ కనెక్టర్ మరియు అన్ని రకాల ద్విచక్రవాహనాల కోసం వినియోగించతగిన చార్జర్లను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా వేసిన అతి పెద్ద ముందడుగు. ఈ దశలో పరిశ్రమలో సహకారం అనేది అతి ముఖ్యం. మేమిప్పటికే పలు ఓఈఎంలతో చర్చలు జరిపి ఈ పరిశ్రమ భాగస్వామ్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.