మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:38 IST)

తమిళనాడులోని హోసూర్‌లో ఎథర్‌ ఎనర్జీ తయారీకేంద్రం

భారతదేశపు మొట్టమొదటి తెలివైన విద్యుత్‌ వాహన తయారీదారు, ఎథర్‌ ఎనర్జీ తమ కార్యక్రమాలను తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న తమ భారీ కర్మాగారంలో 02 జనవరి 2021వ తేదీ నుంచి ఆరంభించింది. అప్పటి నుంచి, ఎథర్‌ ఎనర్జీ తమ వాహనాల డెలివరీలను ముంబై, పూనె, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్‌లలో ఆరంభించింది. అంతేకాకుండా మొదటి త్రైమాసం నాటికి దశల వారీగా భారతదేశంలో ఇతర నగరాలలోనూ డెలివరీలను అందించనున్నారు.
 
మేక్‌ ఇన్‌ ఇండియా దృష్టికి ఖచ్చితమైన ఉదాహరణగా ఈ కర్మాగారం నిలువనుంది. ఎథర్‌ ఎనర్జీ యొక్క ఉత్పత్తులలో 90% స్థానికీకరించారు. దీనిలో బ్యాటరీ ప్యాక్‌లను ఎథర్‌ తనంతట తానుగా తయారుచేస్తోంది. ఎథర్‌ 450 ఎక్స్‌ మరియు ఎథర్‌ 450 ప్లస్‌‌లు పూర్తిగా భారతదేశంలో తయారుచేశారు. బలీయమైన స్థానిక పర్యావరణ వ్యవస్ధ కలిగి ఉండటం కారణంగా, ఎథర్‌ ఎనర్జీ యొక్క అధిక శాతం సరఫరాదారులు తమిళనాడులోనే ఉన్నారు. ఈ కారణం చేతనే హోసూరును ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన కేంద్రంగా మలుచుకుంది.
 
వార్షికంగా 1,10,000 స్కూటర్లను తయారు చేసే సామర్థ్యం కలిగిన ఈ కేంద్రం, ఎథర్‌ ఎనర్జీ యొక్క జాతీయ ఉత్పత్తి కేంద్రంగా నిలువడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్‌ను తీర్చనుంది. ఎథర్‌ ఎనర్జీ ఇప్పటి వరకూ 15 రాష్ట్రాలలో 27 నగరాలలో తమ ఉనికిని చాటడంతో పాటుగా డెలివరీలను కూడా అందించింది. (బెంగళూరు, చెన్నై, ముంబై, పూనె, ఢిల్లీ, హైదరాబాద్‌, కొచి, కోయంబత్తూరు, కోల్‌కతా, కాలికట్‌, అహ్మదాబాద్‌, మైసూరు, హుబ్లీ, జైపూర్‌, ఇండోర్‌, పనాజీ, భుబనేశ్వర్‌, నాసిక్‌, సూరత్‌, చండీఘడ్‌, విజయవాడ,  విశాఖపట్నం, గౌహతి, నాగ్‌పూర్‌, నోయిడా, లక్నో, సిలిగురి). 2021 సంవత్సరాంతానికి 40 నగరాలకు ఎథర్‌ ఎనర్జీ విస్తరించనుంది.
 
ఈ ఫ్యాక్టరీకి తమిళనాడుకు ప్రభుత్వం తమ ఈవీ పాలసీ కింద మద్దతునందించింది. ఈవీ తయారీతో పాటుగా ఈ కేంద్రంలో లిథియం-అయాన్‌ బ్యాటరీ తయారీపై కూడా దృష్టి సారించారు. మరింతగా ముందుకు వెళ్లేందుకు కంపెనీ దృష్టిసారించిన విభాగం ఇది. ఈ రంగంలో విలువ సృష్టికి ఓ అవకాశంగా పెట్టుబడులు నిలువడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి. ఈవీ రంగంలో అవసరమైన నైపుణ్యాలను పొందడం కోసం 4వేల మందికి పైగా ఉద్యోగులకు రాబోయే ఐదేళ్లలో శిక్షణను అందించనున్నారు.
 
ఈ తయారీ కేంద్రాన్ని ఇండస్ట్రీ 4.0 సిద్ధాంతాలపై ఆధారపడి నిర్మించారు. ఈ కేంద్రంలో అత్యాధునిక పరిష్కారాలు ఉన్నాయి. ఇవి సాంకేతికత, మానవ వనరులు, ప్రస్తుత వ్యవస్థలు, ప్రక్రియలను మొత్తం తయారీ నెట్‌వర్క్‌లో మిళితం చేస్తుంది. ఈ బృందం ఇప్పుడు ఫ్యాక్టరీని స్మార్ట్‌గా మార్చేందుకు కృషి చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని చదివేందుకు స్మార్ట్‌ అల్గారిథమ్స్‌ను ఆధీకృతం చేయడంతో పాటుగా అర్థవంతమైన వివరణలను సైతం అందిస్తుంది. సమగ్రమైన సరఫరా చైన్‌ ప్రక్రియ సమాచార కేంద్రంగా ఉంటుంది. ఇది ఎథర్‌ యొక్క ప్రక్రియలు, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌, నాణ్యతా పరీక్షలు, ఉత్పాదకతను మిళితం చేయడంతో  పాటుగా చివరగా వాహన డిశ్పాచ్‌ను చేస్తుంది.
 
ఈ సదుపాయంలో ప్రతి సంవత్సరం 120000 బ్యాటరీ ప్యాక్‌లను సైతం తయారుచేసే సామర్థ్యం ఉంది. బ్యాటరీకి సంబంధించి 13 పేటంట్లను ఎథర్‌ ఎనర్జీ పొంది ఉంది. వీటిని అంతర్గతంగా తీర్చదిద్దడంతో పాటుగా నిర్మించనున్నారు. భారతదేశంలో తమ సొంత బ్యాటరీ ప్యాక్‌లను తయారుచేస్తోన్న ఒకే ఒక్క ఈవీ ఓఈఎంగా ఎథర్‌ ఎనర్జీ నిలుస్తుంది. ఎథర్‌ 450 ఎక్స్‌లోని 2.9 కిలోవాట్‌/హవర్‌ బ్యాటరీ 21700 టైప్‌ లి–అయాన్‌ సెల్స్‌ వినియోగించుకుంటుంది. ఇది బ్యాటరీకి అత్యధిక శక్తి సాంద్రత, చార్జ్‌ అందిస్తుంది మరియు డిశ్చార్జ్‌ రేట్స్‌ సైతం అందిస్తుంది. ఇది వేగవంతమైన చార్జింగ్‌ మరియు అత్యున్నత పనితీరును అందిస్తుంది.
 
వాహన టెస్ట్‌ రైడ్స్‌ సమయంలో ఎలాంటి గాలి కాలుష్యమూ ఉండదు. ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి ఉద్గారాలూ వెలువడవు. అన్ని ఈ–వ్యర్థాలనూ ఆధీకృత రీసైకిలర్స్‌ నిర్వహిస్తారు. అంతర్గత ఎస్‌టీపీ ఉండటం చేత జీరో వాటర్‌ డిశ్చార్జ్‌ ఉంటుంది. ఇది నీటిని శుద్ధి చేయడంతో పాటుగా ప్లష్‌ మరియు ప్లాంటేషన్‌ కోసం వినియోగిస్తుంది.
 
తరుణ్‌ మెహతా, సీఈవో అండ్‌ కో–ఫౌండర్‌, ఎథర్‌ ఎనర్జీ మాట్లాడుతూ... ఇప్పటి వరకూ అద్భుతమైన ప్రయాణం కొనసాగింది. ఈ కర్మాగారాన్ని ఆరంభించడం కంపెనీకి ఓ మైలురాయిగా నిలుస్తుంది. వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది మరియు మేము ఇప్పుడు నూతన మార్కెట్‌లకు సైతం విస్తరిస్తున్నాం. ఈ అత్యాధునిక కర్మాగారంతో దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను మేము తీర్చగలం. మేము మా ఉత్పత్తిలను ఆది నుంచి డిజైన్‌ చేసి రూపొందిస్తుండటం పట్ల గర్వంగా ఉన్నాము. భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం మరియు వారి ఈవీ పాలసీలకు మేము ధన్యవాదములు  తెలుపుతున్నాం. వారి విధానాల కారణంగానే అధిక శాతం మా సరఫరాదారులు ఈ రాష్ట్రంలో పొందగలగడంతో పాటుగా స్వయం సమృద్ధి సాధించేందుకు సైతం అది మాకు తోడ్పడింది.