ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:04 IST)

హైదరాబాద్‌లో తమ రిటైల్‌ కార్యకలాపాలు ఆరంభించిన ఎథర్‌ఎనర్జీ

భారతదేశంలో మొట్టమొదటి ఇంటిలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ, అధికారికంగా తమ నూతన రిటైల్‌ ఔట్‌లెట్‌, ఎథర్‌ స్పేస్‌ను మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ వద్ద శిల్పారామం ఎదురుగా ప్రైడ్‌ మోటార్స్‌ సహకారంతో ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాంతాన్ని ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం కోసం ఎంచుకున్నారు. ఇది మారుతున్న ఐటీ, ఐటీఈఎస్‌ ప్రజల అవసరాలను తీర్చనుంది. ఈ ఎథర్‌ స్పేస్‌ ప్రారంభోత్సవంలో ఔత్సాహిక ఎథర్‌ వినియోగదారులు పాల్గొన్నారు. వీరు ఎథర్‌ స్పేస్‌ అనుభవాలను తొలిసారిగా పొందాలనుకున్నారు.
 
భారతదేశంలో అత్యంత వేగవంతమైన మరియు స్మార్టెస్ట్‌ స్కూటర్‌ ఎథర్‌ 450ఎక్స్‌. ఇది టెస్ట్‌ రైడ్‌ కోసం మరియు కొనుగోలు కోసం ఎథర్‌ స్పేస్‌ వద్ద లభించనుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రంలో వినూత్నమైన యాజమాన్య అనుభవాలను అందించే ఏర్పాట్లు ఉన్నాయి. దీనితో పాటుగా యజమానుల కోసం సంపూర్ణమైన సేవల మద్దతు కూడా లభించనుంది. శక్తివంతమైన, స్పర్శ మరియు ఇంటరాక్టివ్‌ ప్రాంగణంగా తీర్చిదిద్దబడిన ఈ నూతన ఎథర్‌ స్పేస్‌ ఇప్పుడు వినియోగదారులకు వాహనం గురించి ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం అందిస్తుంది మరియు పలు భాగాలకు సంబంధించి సమగ్రమైన అవగాహనను సైతం కల్పిస్తుంది. స్కూటర్‌కు సంబంధించి కీలకమైన విడిభాగాలను చూసే అవకాశంతో పాటుగా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా తెలివైన మరియు కనెక్టడ్‌ ఫీచర్లను సైతం తెలుసుకోవచ్చు.
 
ఎథర్‌ స్పేస్‌ను విద్యుత్‌ వాహనాల పట్ల వినియోగదారులకు అవగాహన కల్పించే రీతిలో తీర్చిదిద్దారు. ఇది ఇంటరాక్టివ్‌ ప్రాంగణంలో సమగ్రమైన అనుభవాలను అందిస్తుంది. ఈ కంపెనీ తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని బెంగళూరులో జూన్‌ 2018లో  ఆరంభించింది. ఆ తరువాత తమ మరింత పెద్ద ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రంగా చెన్నైలో ఆరంభం కావడంతో పాటుగా వినియోగదారులకు అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటుగా సమాచారయుక్త కొనుగోలు నిర్ణయాలను సైతం తీసుకునే అవకాశం అందిస్తుంది.
 
ఈ సంవత్సరారంభంలో, ఎథర్‌ తమ ఉనికిని ముంబై, పూనె మరియు అహ్మదాబాద్‌లకు విస్తరించింది. ఇప్పుడు తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం తెరువడం ద్వారా హైదరాబాద్‌లోని వినియోగదారులు ఎథర్‌ 450 ఎక్స్‌ను సవారీ చేయవచ్చు. అదే రీతిలో ఉత్పత్తి గురించి మరింత లోతుగా తెలుసుకుంటూనే, దాని ఫీచర్లను ముందుగానే తెలుసుకుని వాహనం కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రానికి రాక మునుపే వారు ఎథర్‌ ఎనర్జీ వెబ్‌సైట్‌పై రైడ్‌ స్లాట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు.
 
ఎథర్‌ ఎనర్జీ ఇప్పటికే హైదరాబాద్‌లో ఎథర్‌ గ్రిడ్‌ పాయింట్లను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ 2 వేగవంతమైన చార్జింగ్‌ పాయింట్లను నగరంలో ఏర్పాటుచేసింది.ఈ చార్జింగ్‌ పాయింట్లు అల్మండ్‌ హౌస్‌ (కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, ఎస్‌డీ రోడ్‌), స్విస్‌ కాసెల్‌ (విద్యానగర్‌), ద మూన్‌షైన్‌ ప్రాజెక్ట్‌ (జూబ్లీహిల్స్‌), ఫ్లిప్‌సైడ్‌ (నానక్‌రామ్‌ గూడా), చాయ్‌ కహానీ(సైనిక్‌పురి), శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ (కొండాపూర్‌), డీఎఫ్‌ఎల్‌ వర్ట్యుమాల్‌ (ఉప్పల్‌) నోమా టాకీస్‌ (నాచారం), తాజ్‌మహల్‌హోటల్‌ (అబిడ్స్‌) మరియు ఎథర్‌ స్పేస్‌ హైదరాబాద్‌లో ఉన్నాయి.
 
నగరంలో ఈవీల స్వీకరణ వేగవంత చేసేందుకు ఎథర్‌ ఎనర్జీ ఇప్పుడు ఉచిత చార్జింగ్‌ను ఎథర్‌ గ్రిడ్‌పై మార్చి 2021 వరకూ అన్ని ఎలక్ట్రిక్‌ 4వీలర్స్‌, 2 వీలర్స్‌కు అందిస్తుంది. ఈ కంపెనీ మరో 10-12 చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటుచేయడం ద్వారా ఎథర్‌  చార్జింగ్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తూనే, ఆహ్లాదకరమైన, ఒత్తిడి లేని సవారీలను నగరంలోని ఈవీ యజమానులకు అందించనుంది.
 
ఎథర్‌ ఎనర్జీ ఇప్పుడు అతి తక్కువ శక్తి కలిగిన ఎథర్‌ 450 ప్లస్‌ను సైతం అందిస్తుంది. ఇది గరిష్టంగా 70కెఎంపీహెచ్‌తో నడుస్తుంది మరియు ఎకో మోడ్‌లో 70 కిలోమీటర్లు శ్రేణిలో నడుస్తుంది. ఎథర్‌ 459 ప్లస్‌ ఇప్పుడు 4జీ కనెక్టివిటీ, ఆన్‌బోర్డ్‌ నేవిగేషన్‌ మరియు ఇతర కనెక్టడ్‌ ఫీచర్లను అందిస్తుంది. కానీ దీనిలో బ్లూటూత్‌ కనెక్టివిటీ మరియు హై పవర్డ్‌ వ్రాప్‌ మోడ్‌ లేదు. ఎథర్‌ 450 ఎక్స్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర హైదరాబాద్‌లో 1,61,426 రూపాయలు మరియు ఎథర్‌ 450 ప్లస్‌ ధర 1,42,416 రూపాయలు.
 
రవ్‌నీత్‌ ఫోకేలా, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, ఎథర్‌ ఎనర్జీ మాట్లాడుతూ... ‘‘ఈవీల పట్ల అవగాహన కల్పించడం మాత్రమే కాదు, డిమాండ్‌ను సృష్టించడానికీ 2020 సంవత్సరం మాకెంతగానో సహాయపడింది. 2021వ సంవత్సరంలో కూడా ఇదే తరహా స్పందన చూస్తున్నాం. ఫేమ్‌2 లాంటి విధానాలు ఈ మార్పుకు అత్యంత కీలక పాత్ర పోషించడంతో పాటుగా ఓఈఎంలు అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్‌ ద్వి చక్ర వాహనాలను పరిచయం చేసేందుకు అనుమతించింది.
 
ప్రభుత్వ కార్యక్రమాలు మరియు రాష్ట్ర విధానాలు ఈవీలను ప్రోత్సహించే రీతిలో ఉండటంతో పాటుగా పన్నులను రద్దు చేయడం, రాయితీలను అందించడం ద్వారా అమ్మకాలను వృద్ధి చేయడంతో పాటుగా మా నుంచి అస్యూర్డ్‌ బై బ్యాక్‌ కార్యక్రమాలు, ఎక్సేంజ్‌ అండ్‌ లీజ్‌ ప్రోగ్రామ్‌లు వంటివి వినియోగదారుల నమ్మకం పొందడంలో సహాయపడ్డాయి. మా ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం, వినియోగదారులు ఈవీలను అర్ధం చేసుకునేందుకు మరియు ఐస్‌ నుంచి విద్యుత్‌కు మృదువుగా మారేందుకు సహాయపడింది.
 
మా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఎథర్‌ ఎనర్జీ యొక్క విలువప్రతిపాదన, తెలివితేటల శక్తితో కూడిన అసాధారణ అనుభవంను ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది. స్కూటర్ల అనుభవాలను ప్రజలు ఆస్వాదించేలా తీర్చిదిద్దిన ప్రాంగణమిది. ఇక్కడ వారు మా అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్‌ వాహనాలను అర్థం చేసుకోగలరు మరియు విద్యుత్‌ వాహన భవిష్యత్‌లోనూ భాగం కాగలరు. ప్రైడ్‌ మోటార్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.
  
హైదరాబాద్‌లో మా నూతన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌తో మా విస్తరణ ప్రణాళికలకు మద్దతునందిస్తుంది. వారి విస్తారమైన అనుభవం మరియు ఆటోమోటివ్‌ రిటైల్‌ విభాగంలో మా నిరూపితమైన నైపుణ్యం వంటివి మా అభిమానులు, వినియోగదారులకు ఓ అనుభవాన్ని కల్పించేదిశగా మా ప్రయత్నాలను పూర్తి చేస్తాయి. ముంబై, పూనె, అహ్మదాబాద్‌లలో మా ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాల ఆవిష్కరణను అనుసరించి, హైదరాబాద్‌లోని మా ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం కదలికలను వేగవంతం చేయడంతో పాటుగా భారతదేశంలో మా ఉనికిని మరింత బలోపేతం చేయనుంది’’ అని అన్నారు.
 
ఎం సురేష్‌ రెడ్డి, ఛైర్మన్‌, ప్రైడ్‌ మోటార్స్‌ మాట్లాడుతూ.. ‘‘ఆటోమొబైల్‌ రిటైల్‌ గ్రూప్‌ ప్రైడ్‌ మోటార్స్‌కు ఎన్నో కార్ల బ్రాండ్లతో ఫ్రాంచైజీలను కలిగి ఉంది. ఇప్పుడిది ఎథర్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకుని భవిష్యత్‌ మొబిలిటీ అయిన ఈవీ రంగంలో ప్రవేశించింది. స్టార్టప్‌గా ఆరంభమై పూర్తి స్ధాయి ఆటోమొబైల్‌ తయారీ కంపెనీగా రూపాంతరం చెందిన సంస్థ ఎథర్‌ ఎనర్జీ.

ఈ కంపెనీ ఇప్పుడు విస్తారమైన పరిశోధన, అభివృద్ధిని ఎన్నో సంవత్సరాలుగా చేయడంతో పాటుగా ప్రత్యేకమైన, అత్యంత సృజనాత్మక, వినియోగదారుల అనుకూల ఉత్పత్తిని తీర్చిదిద్దింది. ఇప్పుడు దీనిని మనమంతా చూడటంతో పాటుగా ఆస్వాదించనూవచ్చు. ఈ అభివృద్ధి వెనుక ఉన్న బృందం పూర్తి అంకితభావం మరియు నమ్మకంతో ఈ ఉత్పత్తిని భవిష్యత్‌ మీద అసాధారణ విశ్వాసంతో తీర్చిదిద్దారు. నేను ఈ ఉత్పత్తుల పట్ల పూర్తి ఆసక్తిగా ఉన్నాను మరియు ఎథర్‌ ఎనర్జీతో మా గ్రూప్‌ భాగస్వామ్యం పట్ల గర్వంగా ఉన్నాము’’