1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 31 అక్టోబరు 2022 (19:00 IST)

మాస దుర్గాష్టమి స్పెషల్ : పూజ ఎలా చేయాలంటే?

Durga Matha
మాస దుర్గాష్టమి రోజున దుర్గాదేవి యెుక్క మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున దుర్గా చాలీసా, దుర్గా సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని పఠించడం మంచిదని భావిస్తారు. 
 
దేవి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే దుర్గాష్టమి రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే.. ఈతిబాధలు వుండవు. 
 
దుర్గామాతకు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను అందించడం ద్వారా సంకల్ప సిద్ధి చేకూరుతుంది. పూజ అనంతరం దుర్గామాత అష్టోత్తర మంత్రాన్ని తప్పకుండా చదవాలి. ఈ రోజున దుర్గాదేవి ఆయుధాలను పూజిస్తారు. ఆచారాన్ని అస్త్ర పూజ అంటారు. ఈ రోజును విరాష్టమి అని కూడా అంటారు.
 
ఈ సందర్భంగా భక్తులు దుర్గాదేవికి ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం ఉంటారు.
దుర్గా అష్టమి వ్రతం నవంబర్ 2022 తేదీ: నవంబర్ 01, మంగళవారం.
 
దుర్గా అష్టమి వ్రత ఆచారాలు: భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, పుష్పాలు, చందనం. ధూపం అమ్మవారికి అనేక నైవేద్యాలు సమర్పించాలి.