బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (09:44 IST)

నేడు కోటి సోమవారం.. ఉపవాసం దీక్షను చేయగలిగితే..?

Lord shiva
Lord shiva
నేడు కోటి సోమవారం.. ఉపవాసం దీక్షను చేయగలిగితే కోటి పుణ్యం లభిస్తుంది. దేవునికి సన్నిహితంగా, దగ్గరగా నివసింపచేసేదే "ఉపవాసం" అంటే. ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం - ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా అవసరం. 
 
ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మనోవైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి. 
 
ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ గడపడం అనుసరించాలి. సర్వసాధారణంగా ఉపవాసమంటే, వండిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహార పదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు.
 
కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన సోమవారం కోటి సోమవారం. కోటి అంటే ‘కోటి’, సోమవరం అంటే ‘సోమవారం’. అంటే ఈ సోమవారం కోటి సోమవారాలకు సమానం. ఈ రోజున పవిత్రమైన ఆచారాలను నిర్వహించడం వలన మరిన్ని పుణ్య ఫలితాలు లభిస్తాయి.
 
ఈ మాసం శివునికి ప్రత్యేకం అయితే కొన్ని రోజులు విష్ణువుకి ప్రత్యేకం. ఉపవాసం, మంత్రోచ్ఛారణ, ఆలయ సందర్శనలు, పవిత్ర నదులలో పవిత్ర స్నానాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్ర మాసంలో వివిధ పూజలు నిర్వహిస్తారు. సోమవారాలతో సహా పవిత్రమైన రోజులలో ప్రజలు ఉపవాసాలను పాటిస్తారు. 
 
సాధారణంగా, వారు పగటిపూట ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. అత్యంత పవిత్రమైన సోమవారం అయిన కోటి సోమవారం కార్తీకమాసంలో శ్రావణ నక్షత్రం రోజున పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం వస్తుంది. 
shiva
shiva
 
భక్తులు ఈ రోజున అభిషేకం లేదా పూజలు చేస్తారు. కార్తీక మాసం సోమవారం సాయంత్రం పూట ఆలయాలలో నేతి దీపాలను వెలిగించాలి. సోమవార వ్రతం లేదా పవిత్రమైన సోమవారం ఆచారాలను పాటించడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాక, అది మోక్షానికి దారి తీస్తుంది.