శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (10:19 IST)

నాగుల చవితి.. నాగదోషం వున్న వారు.. ఇలా చేస్తే?

నాగుల చవితి శుక్రవారం అక్టోబర్ 28వ తేదీన వస్తోంది. పండుగనాడు నాగయ్యను పూజించి, చలివిడి, వడపప్పు, చిమ్మిలిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. నాగదోషం ఉండేవారు ఈరోజున నాగారాధనను కనుక చేసినట్లయితే అనేక రకాలైన దోషాలు ముఖ్యంగా రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలిగిపోతాయి. 
 
ఈ రోజు ఉదయాన్నే మేలుకొని, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. కొందరు రాత్రి భోజనం చేస్తారు. అది వారి వారి ఆచారాన్ని బట్టి ఉంటుంది. 
 
ఆ తర్వాత ఇంట్లో నాగప్రతిమ ఉంటే దానికి అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజను చేసి, నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యంపిండి, పాలు కలిపి చేస్తారు. ఇక పండ్లు, ఆవుపాలు కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తారు.