1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Niharika's Next Film Suryakantam

వెండితెర "సూర్యకాంతం"గా నిహారిక?

తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక. 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా అవతారమెత్తింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది.

Niharika
తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక. 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా అవతారమెత్తింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె వరుసగా సినిమాలను అంగీకరిస్తూ వెళుతోంది. తెలుగులో సుమంత్ అశ్విన్‌తో 'హ్యాపీ వెడ్డింగ్' షూటింగును పూర్తి చేసిన నిహారిక, ఓ తమిళ సినిమాతోను అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది.
 
ఈ నేపథ్యంలో నిహారిక ప్రధాన పాత్రలో 'సూర్యకాంతం' అనే సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో నిహారిక ప్రధాన పాత్రగా 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్‌‍సిరీస్‌కి దర్శకత్వం వహించిన ప్రణీత్, ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బాలకృష్ణ 'జై సింహా` రివ్యూ ... కొత్త సీసాలో పాత సారా...