ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (16:23 IST)

నిహారిక ''హ్యాపీ వెడ్డింగ్'': పల్లెటూరి ప్రేమకథ.. ప్లస్ అవుతుందా?

నిహారిక తాజా సినిమా ''హ్యాపీ వెడ్డింగ్'' షూటింగ్ ముగిసింది. ''ఒక మనసు'' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిహారిక ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించలేకపోయినా.. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాతో పాటు హ్యాపీ

నిహారిక తాజా సినిమా ''హ్యాపీ వెడ్డింగ్'' షూటింగ్ ముగిసింది. ''ఒక మనసు'' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిహారిక ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించలేకపోయినా.. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అంటూ మరో సినిమాలో నటించడం ద్వారా మంచి మార్కులు కొట్టేయవచ్చునని ఆశలు పెట్టుకుంది. 
 
సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని... మంచి టీమ్‌తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని నిహారిక తెలిపింది.

ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ అంటూ చెప్పుకొచ్చింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని నిహారిక స్పష్టం చేసింది.