సంబంధిత వార్తలు
- Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్
- Virat Karna: నాగబంధం లో రెండు రకాల గెటప్స్‌లో విరాట్ కర్ణ లుక్ విడుదల
- Nabha Natesh: నాగబంధం శైలిలో నమో రే పాటకు క్లాసిక్ నృత్యతో ఆకట్టుకున్న నభా నటేష్ మరియు దక్ష నాగర్కర్
- Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట
- Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్ లుక్
Nikhil: నిఖిల్ సిద్ధార్థ్.. స్వయంభు నుంచి రారా దేవరా.. సాంగ్ వచ్చేసింది
Nikhil Siddhartha- Swayambhu Rara Devara Song
'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ సిద్ధార్థ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్ నిర్మాణంతో, టాగోర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు.
ఫస్ట్ సింగిల్ 'రా రా ధీవర'లో నిఖిల్ ఒక యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు. ఈ పాట ఎంత గ్రాండ్‌గా, అద్భుతంగా, కళ్లు చెదిరేలా ఉండబోతోందో ఈ పోస్టర్ సూచిస్తుంది. ఇంతకుముందు విడుదలైన టీజర్, భారీతనం, విజువల్స్, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందనను అందుకుని, సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
పాత్రలో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రంలో సంయుక్త,నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కేకే సెంథిల్ కుమార్, సంగీతాన్ని రవి బస్రూర్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్ ఎం. ప్రభాహరన్, రవీంద్ర.
త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.
