కన్నడ బ్యూటీ సన్నజాజి నడుంపై కన్నేసిన 'భీష్మ'

bheeshma
ఠాగూర్| Last Updated: ఆదివారం, 27 అక్టోబరు 2019 (12:26 IST)
కన్నడ బ్యూటీ మందన్నాపై టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ కన్నేశాడు. దీంతో రష్మిక నడుంను పట్టుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. అయితే, ఈ లవర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో "భీష్మ" రిలీజ్ అయ్యేంతవరకు వేచిచూడాల్సిందే.

నితిన్ తాజా చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జ‌రుగుతుంద‌ని సమాచారం.

అక్కడ ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రం నుండి రెండు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. ఇవి అభిమానుల‌లో ఆనందాన్ని క‌లుగ‌జేస్తున్నాయి.



దీనిపై మరింత చదవండి :