సంబంధిత వార్తలు
- సహజీవనం చేస్తూ పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. దాడి చేసిన ప్రియురాలు.. ఎక్కడ?
- అలాంటి సంబంధాలు అత్యాచార కేసులుగా పరిగణించరాదు : ఒరిస్సా హైకోర్టు
- పెళ్లి మండపంలో వధువుకు వాంతులు.. వరుడు ఏం చేశాడో తెలుసా?
- క్రికెటర్‌ను పెళ్ళాడనున్న హీరో విశాల్ ప్రియురాలు?? (Video)
- మహిళతో వివాహేతర బంధం ... 13 యేళ్ల బాలికతో 37 యేళ్ల వ్యక్తి పెళ్లి
లాక్ డౌన్ అయినా పర్లేదు.. లేటుగానే పెళ్లి చేసుకుంటా.. నితిన్
టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహం లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వివాహాలన్నీ చాలా సింపుల్‌గా జరిగిపోతున్న సంగతి విదితమే. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువమంది సమక్షంలో ఇప్పటికే మరో యాక్టర్ నిఖిల్ సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నాడు.
మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా లాక్‌డౌన్‌లో రెండో వివాహం చేసుకున్నారు. నితిన్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ నితిన్ తన పెళ్లిని సింఫుల్‌గా చేసుకునేందుకు రెడీగా లేడట.
ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు పెళ్లికి సమయం తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అవసరమైతే తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నాడట.
