శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (16:19 IST)

వదినమ్మా.. నీవు పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు..

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తన మదిలో వచ్చిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ చిక్కుకు ప్రధాన కారణంగా ఉన్నాయి.

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు పెద్ద చిక్కు వచ్చిపడింది. రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తన మదిలో వచ్చిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ చిక్కుకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఆమె మదిలో మెదిలిన ఈ ఆలోచనపై పలువురు మండిపడుతున్నారు. ఆమె సోషల్ మీడియా టైమ్ లైన్‌పై కామెంట్ల వరద కొనసాగుతూనే ఉంది. 
 
తాజాగా పవన్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ పిల్లలకు తల్లిగా బాధ్యత లేదా? అకీరా, ఆరాధ్యలను ఏం చేస్తావు? పవన్ అన్న నుంచి మీరు విడాకులు తీసుకుని ఉండొచ్చు. కానీ పవన్ పిల్లలకు దూరం కాలేదుగా? మీ కొత్త భర్త పిల్లలను చేరదీయకుంటే..? మీ జంటకు పిల్లలు పుడితే, అకీరా, ఆరాధ్య సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
 
ఇంకొందరు మరో అడుగు ముందుకేసి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని, పవన్ కల్యాణ్ లేకుంటే అసలు రేణు దేశాయ్ అన్న పేరే బయటకు వచ్చుండేది కాదని, ఇకపై 'వదినగారూ' అని పిలవబోమని కామెంట్లు పెడుతున్నారు. ఇకపై ఇంటర్వ్యూల్లో పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించవద్దని హెచ్చరిస్తున్న కామెంట్లూ వస్తున్నాయి. మరొక అభిమాని అయితే.. వదినమ్మా.. నీవు పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు అంటూ కామెంట్స్ చేశారు.