శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (15:04 IST)

తేలు కుడితే విషం తీసేయడం చిటికెలో పని...

తేలు కుట్టినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అయితే తేలు కుట్టినప్పుడు చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమయాల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.

తేలు కుట్టినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అయితే తేలు కుట్టినప్పుడు చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమయాల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అయితే తేలుకాటుకు ఆయుర్వేదంలో మంచి మందు అందుబాటులో ఉంది. నిమిషాల్లో విషం పోయి మనిషి సాధారణ స్థితికి చేరుకుంటారు.
 
ములతుత్తంను నూరి దాన్ని తేలు కుట్టిన చోట తడిచేసి అద్దితే విషం వెంటనే దిగిపోతుంది. తేలు కాటు వేసిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి కొంచెం ఉప్పును నీటిలో మూటగట్టి నీటిలో ఉంచి ఆ నీటి బొట్లను రెండు కళ్ళలో వేస్తే తేలు విషం దిగిపోతుంది. ములతుత్తం స్పటికను మెత్తగా నూరి క్రొవ్వొత్తిని కరిగించి ఈ రెండు మిశ్రమాన్ని కరిగించి కణికలాగా చేయాలి. ఆ కణికను తేలు కుట్టిన ప్రదేశంలో ఉంచాలి. దాంతో పాటు ఎర్రగడ్డను సగంగా కోసి తేలు కుట్టిన చోట రుద్దాలి.. ఇలా చేసినా విషం తగ్గిపోతుంది.