గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (14:11 IST)

డెంగూ జ్వరాన్ని దూరం చేసే బొప్పాయి..

విష జ్వరాల్లో ఒక రకమైన డెంగూ జ్వరాన్ని బొప్పాయి దూరం చేస్తుంది. వర్షాకాలం కావడంతో జ్వరాల భయం అందరికీ వుంటుంది. వైరల్ ఫీవర్లైన డెంగూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు జనాలను భయపెడుతున్నాయి. ఈ జ్వరా

విష జ్వరాల్లో ఒక రకమైన డెంగూ జ్వరాన్ని బొప్పాయి దూరం చేస్తుంది. వర్షాకాలం కావడంతో జ్వరాల భయం అందరికీ వుంటుంది. వైరల్ ఫీవర్లైన డెంగూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు జనాలను భయపెడుతున్నాయి. ఈ జ్వరాలను దూరం చేసుకోవాలంటే... బొప్పాయిని ఆహారంలో తీసుకోవాలి. అంతర్గత అవయవాలలో రక్తస్రావం అవుతాయి. అయితే బొప్పాయిని తీసుకోవడం ద్వారా రక్త కణాలు పెరుగుతాయి. 
 
ఇనుము శక్తి పెరుగుతుంది. తద్వారా జ్వరాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి, కె, ఇ వంటి పోషకాలుండటం ద్వారా క్యాన్సర్ కణాలతో అవి పోరాడుతాయి. ఇందులోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి ఆకులు, మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయలను సమపాళ్లలో తీసుకుని.. నాలుగు గ్లాసుల నీటిలో మరిగించాలి. బాగా మరిగాక ఈ నీటిని వడగట్టి.. ఉదయం, సాయంత్రం మూడు రోజుల పాటు గ్లాసుడు తీసుకుంటే వైరల్ ఫీవర్లు మాయమవుతాయి.  
 
రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకుని.. అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ తేనె చేర్చి వారానికి ఓ సారి.. ఇలా నాలుగు వారాల పాటు తీసుకుంటే కడుపులో నులిపురుగులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.