మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (08:58 IST)

తప్పు చేసింది మీరు.. మీకు క్షమాపణలు చెప్పాలా.. నెవర్ అంటున్న డీఐజీ రూప

పరప్పన జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు అక్రమంగా వసతులు కల్పించారని పక్కా ఆధారాలతో పైస్థాయి అధికారులుకు తెలియజేసి తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఎలాంటి తప్పూ చేయలేదని, అందుకు గాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని బెంగళూరు నగర ట్రా

పరప్పన జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు అక్రమంగా వసతులు కల్పించారని పక్కా ఆధారాలతో పైస్థాయి అధికారులుకు తెలియజేసి తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఎలాంటి తప్పూ చేయలేదని,  అందుకు గాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని బెంగళూరు నగర ట్రాఫిక్‌ కమిషనర్, డీఐజీ డి.రూప తేల్చి చెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పను. బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారిగా జైళ్లలో జరుగుతున్న అక్రమాల గురించి నా పై స్థాయి అధికారులకు తెలియజేశాను. ఈ విషయం పై న్యాయ పోరాటానికి సిద్ధం’  అని ఆమె స్పష్టం చేసారు. 
 
పరప్పన జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు అక్రమంగా వసతులు కల్పించారని, ఇందుకు అప్పటి జైళ్ల డీజీపీ సత్యనారాయణరావ్‌ రూ.2కోట్లు లంచం తీసుకున్నారని అప్పటి జైళ్ల డీఐజీగా రూప రెండు నివేదికలు ప్రభుత్వానికి అందజేయడం తెలిసిందే. సుమారు రెండువారాల క్రితం జరిగిన ఈ సంఘటనలు తీవ్ర కలకలం రేకెత్తించడం తెలిసిందే.
 
అయితే తాను ఏ తప్పూ చేయలేదని, అనవసరంగా నిందలు వేసినందుకు డీఐజీ రూప మూడురోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని డీజీపీ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. లేదంటే రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ ఆయన గత బుధవారం ఆమెకు లీగల్‌ నోటీసులు పంపించారు. 
 
అయితే రూప మాత్రం తాను ప్రభుత్వానికి అందజేసిన నివేదికల్లోనే అవసరమైన ఆధారాలను అందించానని చెబుతున్నారు. అందువల్ల క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని పట్టుదలతో ఉన్నారు. దీంతో పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు వ్యవహారంపై పోలీసుశాఖతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.