1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Payal Rajput opposite Balakrishna in her next

బాలయ్య సరసన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్?

Payal Rajput
బాలయ్య సరసన ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ నటించనుంది. త్వరలో బాలకృష్ణ-కేఎస్ రవికుమాక్ కాంబోలో జై సింహా రిలీజ్ సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రానుంది. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో కవల సోదరులుగా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ హరిప్రియ వినిపిస్తోంది. రెండో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి.. గ్లామర్‌ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
 
ఇప్పటికే 'వెంకీమామ', డిస్కో రాజా వంటి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. తాజాగా బాలకృష్ణ సినిమాలోను పాయల్ అవకాశాన్ని కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక ప్రతినాయక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారు.
తర్వాతి కథనం
డార్లింగ్స్ మీ కోసం సర్‌ప్రైజ్ వుందన్న ప్రభాస్.. రానా ఏమన్నారు..?