గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 15 మే 2019 (20:51 IST)

బాల‌య్య మూవీలో విల‌న్ ఎవ‌రు..? జ‌గ‌ప‌తా..? వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమారా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ... త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో రూపొందే ఈ భారీ చిత్రాన్ని సి.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ నెల 17న ఈ సినిమాని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాలో విల‌న్ పాత్రలో జగపతి బాబు నటించనున్నార‌నే టాక్ వచ్చింది. అలాగే లేడీ విలన్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కనిపించనున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. జ‌గ‌ప‌తిబాబుతో పాటు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా విల‌న్‌గా న‌టిస్తుండడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ విష‌యం అలా అలా నిర్మాత క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కి చేరింది. 

అంతే.. ఈ విషయం పై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించి ప్ర‌చారంలో ఉన్న వార్త‌లపై క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే... ఈ సినిమాలో విలన్ జగపతిబాబు మాత్రమే. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర లేదు అని స్పష్టం చేశారు. దాంతో కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాల‌తో ఆక‌ట్టుకోలేక‌పోయిన బాల‌య్య ఈసారి ఏం చేస్తాడో..?