శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (12:04 IST)

అఫైరూ లేదు.. బ్రేకప్ అంతకంటేనూలేదూ... : అంజలి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అచ్చ తెలుగు అమ్మాయిల్లో అంజలి ఒకరు. ఈమె "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో మంచి పాపులర్ అయింది. ఆ తర్వాత పినతల్లితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సినీ అవకాశాలు లేక వెండితెరకు దూరమైంది. అయితే, అడపాదడపా హారర్ చిత్రాలు చేస్తోంది. 
 
తాజాగా అంజలి నటించిన చిత్రం "లిసా". ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ, 'ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు వుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను నేను ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాను. అందువల్లనే ఆ తరహా సినిమాల్లో నా నటన మరింత బాగుంటుందని చెప్పుకొచ్చింది.
 
పైగా, ఈ ఒక్క కారణంతోనే హారర్ కాన్సెప్టుతో కూడిన కథలు నా దగ్గరికి వస్తున్నాయి. అదేసమయంలో నాకు అఫైర్ ఉందనీ.. బ్రేకప్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి. నాకు ఎవరితోనూ అఫైర్ లేదు కనుక, బ్రేకప్ జరిగే ఛాన్స్ లేదు. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు. అలాగే ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా సినిమాలపైనే వుంది. నా తదుపరి సినిమా అయిన 'సైలెన్స్' కోసం అమెరికా వెళుతున్నట్టు చెప్పుకొచ్చింది.