శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (19:04 IST)

స్త్రీ నడకను బట్టి ఆమె ఎంతటి శృంగారవంతురాలో చెప్పవచ్చట...

ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రవర్తన వుంటుంది. అలాగే ఒక్కో మహిళ శృంగారంలో ఒక్కోలా వుంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు మహిళల నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

స్కాట్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం ఈ విషయాన్ని తేల్చింది. ఈ బృందం వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. ముందుగా ప్రత్యేకంగా తయారుచేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు. శృంగారంలో పాల్గొన్నపుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు. 
 
శృంగార సంబంధమైన అంశాలపై అధ్యయనం చేసే ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలు రకాలుగా విభజించారు. మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహరించారు. వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందినవారు మాత్రమే. మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న తృష్ణ, దక్షత ఊహించగలిగారు. 
 
విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలామటుకు ఏకీభవించాయి. ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుంది. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది. 
 
మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదేవారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుందని సెలవిచ్చారు.