శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (17:04 IST)

వర్మా... నీ కప్ప కనిగుడ్లు పీకి కబోదిని చేస్తారు: నటి దివ్యవాణి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సినీ నటి దివ్యవాణి ఘాటైన విమర్శలు చేశారు. వర్మా.. నీ కప్ప కనిగుడ్లు మహిళలే పీకేస్తారంటూ హెచ్చరించారు. ఎన్నికల వేడి కారణంగా రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్ర ఆవేశంలో ఉన్న తరుణంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సరికాదంటూ టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి తీవ్రస్థాయిలో స్పందించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, వర్మగారూ... ఇవాళ మీపై విమర్శలు చేయడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఓ సంస్కారవంతుడైన నాయకుడి వద్ద మేం పనిచేస్తున్నాం. అందుకే ఎంతో బాధతో మాట్లాడాల్సి వస్తోంది. జాగ్రత్త! నీ కప్ప కనుగుడ్లని తెలుగింటి ఆడపడుచులు పీకిపడేసి నిన్ను కళ్లు లేని కబోదిని చేస్తారు. ఒక పసిబిడ్డ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా దాన్నొక బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది. ఒకవేళ నీకు కోడికత్తి పార్టీ మీద ఆసక్తి కలిగితే ధైర్యంగా కండువా కప్పుకో. ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసుకో. అంతేతప్ప చంద్రబాబునాయుడిగారితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. సీఎం పోస్టులో ఎవరున్నాగానీ వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి' అంటూ హితవు పలికారు. 
 
ఇకపోతే, లక్ష్మీపార్వతి చరిత్రను ప్రత్యేకించి నీవు చెప్పనక్కర్లేదన్నారు. లక్ష్మీపార్వతి ఎలాంటిదో ఆమె మొదటి భర్త వీరగంథం పూసగుచ్చినట్టు వివరించారన్నారు. ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించారని దివ్యవాణి వివరించారు. 'దయ్యాలు లేవు, దేవుళ్లు లేవు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్‌గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం! ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు. ఇతర రాష్ట్రాల్లో మీ సినిమా సంకనాకిపోయిందన్న సంగతి అందరికీ తెలుసునంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.