గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (18:35 IST)

మహిళా పోలీస్‌నే మోసం చేసి రెండో పెళ్ళి చేసుకున్న ఖతర్నాక్ కానిస్టేబుల్

రక్షణగా ఉండాల్సిన పోలీసులే పక్కదారి పడుతున్నారు. పెళ్ళి చేసుకుని పిల్లలు ఉన్నా ఒక యువతిని మోసం చేసి రెండో పెళ్ళి చేసుకున్నాడు కానిస్టేబుల్. అసలు విషయం తెలియడంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కానిస్టేబుల్ కటాకటాల వెనక్కి వెళ్ళాడు. 
 
విశాఖపట్నంకు చెందిన కనకపెంటారావు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా రేణిగుంటలో పనిచేస్తున్నాడు. గతంలో అతనితో పాటు చండీఘర్‌లో పనిచేసిన ఓ మహిళని ప్రేమించాడు. ఆమె కూడా విధుల నిమిత్తం రేణిగుంటకు వచ్చింది. దీంతో ఆమెను నమ్మించి తనకు వివాహం కాలేదని రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రెండురోజులకే కనకపెంటారావు అసలు విషయం బయటపడింది. 
 
సంవత్సరం క్రితమే కనకపెంటారావుకు పెళ్ళయిందని రెండో భార్యకు తెలిసింది. మొదటి భార్య ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడంతో ఈ విషయం కాస్తా బయటకు వచ్చింది. దీంతో బాధితురాలు రేణిగుంట పోలీసులను ఆశ్రయించింది. కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతిలోని అయిదో అదనపు మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించారు న్యాయమూర్తి.