సంబంధిత వార్తలు
- మార్కెట్ లేని హీరో తేజ సజ్జ, కానీ కోట్లు వచ్చేస్తున్నాయి
- తెలంగాణాలో 90% వీక్షకులతో హైదరాబాద్ అత్యధికంగా వినోదాన్ని ఆస్వాదిస్తోంది: డిస్నీ+హాట్‌స్టార్
- రిలయన్స్ జియో నుంచి ఐదు ప్రీపెయిడ్ ప్లాన్స్.. ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగే
- కరోనా మహమ్మారిపై సంపూర్ణేష్ బాబు సినిమా
- సుశాంత్ చివరి సినిమా ''దిల్ బేచారా'' ట్రైలర్ అదుర్స్... 69లక్షల వ్యూస్ (video)
‘హను-మాన్’ను ప్రకటించిన ప్రశాంత్ వర్మ
Hanuman poster
తన బర్త్ డే సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సినిమాటిక్‌యూనివర్స్‌లో సూపర్‌హీరోస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉండనుంది. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ హను–మాన్ టైటిల్, మోషన్ పోస్టర్‌ను మే 29న విడుదల చేశారు.
మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి.
హాలీవుడ్‌ను సూపర్‌హీరోస్ మూవీస్ రూల్ చేస్తున్నాయి. డిస్నీ, మార్వెల్ సూపర్‌హీరోస్ ఫిల్మ్స్ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఇటీవల విడుదలైన సూపర్‌హీరో ఫిల్మ్ అవెంజర్స్ ఎండ్‌గేమ్ ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను రాబట్టింది.
ఈ సూపర్‌హీరో ఫిల్మ్ జానర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్‌హీరోస్ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థియేటర్స్‌రకు రప్పిస్తాయి.
భారతీయ పురాణాల నుంచి హను-మాన్' సినిమాకు స్ఫూర్తి పొందాము. భారతీయులుకు హనుమాన్ సూపర్‌హీరో. ఈ సినిమా టైటిల్‌లో హను మాన్ మధ్యలో వజ్రంతో ఉన్న సూర్యుడి లొగొ ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.
ఇప్పటికే విడుదలైన హనుమాన్ మోషన్ పోస్టర్ విజువల్ అద్భుతంగా ఉండి మంచి స్పందన లభిస్తుంది. మోషన్ పోస్టర్‌లోని హిమాలయాల విజువల్స్ అత్యద్భుతంగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంది. హనుమాన్ చిత్రం సరికొత్తగా ఉంటూ ఎగ్జైటింగ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
