శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:03 IST)

కరోనా మహమ్మారిపై సంపూర్ణేష్ బాబు సినిమా

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై సినీ పరిశ్రమలో పలు సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తుండగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా కరోనా వైరస్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.
 
అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ ఎంటర్‌టైనర్‌గా చేస్తారా లేదంటే సీరియస్ డ్రామాగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. గత సంవత్సరం కొబ్బరి మట్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే.
 
కాగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ‌లాడిస్తోంది. ఈ వైర‌స్‌ను త‌రిమి కొట్ట‌డం ప్ర‌పంచానికి ఓ స‌వాల్‌గా మారింది. అయితే స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ఏ చిన్న సంఘ‌ట‌న చోటు చేసుకున్నా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కావాల్సినంత ముడి స‌రుకు దొరిన‌ట్టే క‌దా? అలాంటిది క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో ఎన్నెన్ని ర‌కాల సినిమాలు వ‌స్తాయో ఊహకు అంద‌నిది. అది సృజ‌నాత్మ‌క‌త‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.
 
తాజాగా టాలీవుడ్‌కు వ‌స్తే... సంపూర్ణేష్‌బాబు స‌రికొత్త క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. శ‌నివారం సంపూర్ణేష్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త సినిమా ప్రాజెక్ట్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సంపూర్ణేష్ త‌న ట్విట‌ర్‌లో విడుద‌ల చేశారు.
 
ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌ల్ల‌టి కోట్‌లో ఉన్న సంపూర్ణేష్ చుట్టూ గ‌బ్బిలాలు, క‌రోనా వైర‌స్‌లు చుట్టుముట్ట‌డాన్ని పోస్ట‌ర్‌లో క‌నిపించాయి. హృద‌యకాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాల‌ను తెర‌కెక్కించిన వాళ్లే ఈ కొత్త సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా టైటిల్ "?" అనే ప్ర‌శ్నార్థ‌క గుర్తును ఖ‌రారు చేయ‌డం విశేషం.