1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rahul Ramakrishna got hollywood offer

అర్జున్ రెడ్డితో మొదలై హాలీవుడ్ చేరిన కమెడియన్

Rahul Ramakrishna
అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు ఎంత చేరువైందో, ప్రతి క్షణం హీరో వెన్నంటే ఉండి ధైర్యం చెబుతూ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనిపించే స్నేహితుని పాత్ర కూడా అందరి మనస్సులలో నిలిచిపోయింది. ఆ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ సహజమైన నటన, భిన్నమైన యాక్సెంట్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ఇక అప్పటి నుండి ఆయనకు వరుస ఆఫర్లు వచ్చాయి. 
 
సమ్మోహనం, హుషారు, గీత గోవిందం వంటి సినిమాలలో కామెడీ పండించి మంచి కమెడియన్ అనిపించుకున్నారు. ఇక "భరత్ అనే నేను" సినిమాలో సామాజిక స్పృహ ఉన్న యువకుడి పాత్రలో నటించి తనలో కమెడియన్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ నటుడికి హాలీవుడ్ అవకాశం తలుపు తట్టింది. "సిల్క్ రోడ్" అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు ఈ కమెడియన్.
 
"నేను అనుకున్నదాని కంటే ఈ శుభవార్త చాలా త్వరగా బయటికి వచ్చింది. నేను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లో నాకు స్థానం దక్కింది. హాలీవుడ్‌లో నేను అడుగుపెట్టబోతున్నా...మా కష్టానికి తగిన ఫలం దక్కాలని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేసారు. ఇంత తక్కువ కాలంలో ఆ స్థాయికి వెళ్లడం అదృష్టమే మరి.
About Writer
ప్రీతి చిచ్చిలి
తర్వాతి కథనం
సైరా: పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్న దేవసేన