శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:56 IST)

యూట్యూబ్ ట్రిండింగ్‌ : #MattiManishinandiNenuకు 3 రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్

పల్లె కోయిలమ్మ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రఘుకుంచె సంగీత సారథ్యంలో పల్లె కోయిలమ్మ అంటూ పసల బేబి పాడిన పాట మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మట్టి మనిషినండి నేను.. అనే పాటను రఘుకుంచె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట యూట్యూబ్‌లో ఒన్ మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ పాటకు లైక్స్, షేర్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సంగీత పరిజ్ఞానం లేకపోయినా.. చదువు రాకపోయినా అద్భుతంగా పాడిన బేబికి పలాస 1978 అనే సినిమాలో పాడే అవకాశం కల్పించారు. దీంతో పాటు మట్టి మనిషినండి అనే పాటను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసి వైరలయ్యేలా చేశారు. 
 
ప్రస్తుతం భారీ వ్యూస్‌ కొల్లగొడుతూ యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించిన రఘు కుంచె... మూడు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించిందని.. ఈ పాటను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.