సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:02 IST)

శ్రీహరికి నివాళులర్పించేందుకు వెళితే ఓ వ్యక్తి నడుము గిల్లాడు.. నటి హేమ

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడి పండించడంలోనూ నటి హేమకు ఆమే సాటి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు జోడీగా.. వెండితెర హాస్యాన్ని పండించే హేమ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన వేధింపుల గురించి నోరు విప్పింది. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురుకాలేదని.. కానీ పబ్లిక్‌‍లో ఓ వ్యక్తి తన నడుము పట్టుకుని గిల్లాడని చెప్పింది. 
 
ప్రముఖ నటుడు శ్రీహరి మృతి చెందిన సమయంలో ఆయన్ని చూసేందుకు వందలాది మంది జనం వచ్చారు. అక్కడ చిరుకుగా వున్నప్పుడు ఓ వ్యక్తి హేమ నడుము పట్టుకుని గిల్లాడట. అయితే వెంటనే హేమ అతడివి పట్టుకుని తుక్కుతుక్కుగా కొట్టిన వైనాన్ని తెలిపింది. ఇలాంటి చేదు అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయని తెలిపింది. మీటూ లాంటివి తనకు ఎదురు కాలేదని.. హేమతో ఎందుకు తనతో ఎవరూ అలా నడుచుకోలేదని హేమ చెప్పింది.