సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (08:58 IST)

19 యేళ్ళ వయసులో డేటింగ్‌కు వెళ్ళా.. అమ్మాయిని చూసి పరుగో పరుగు...

కరణ్ విత్ కాఫీ టీవీ కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. వీరిని జట్టు నుంచి తప్పించి, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరిని స్వదేశానికి పిలిపించింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అమ్మాయిలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసింది ఇపుడు కాదు. 11 యేళ్ళ క్రితం. కోహ్లీ 19 యేళ్ళ వయసులో ఉండగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అనుషా దండేకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమించాడు. 
 
ఆ వీడియోను ఇపుడు ఆస్ట్రేలియా జర్నలిస్టు ఎమ్మెస్ డెన్నిస్ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పరిణితిలేని వయసులో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ఇపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను తొలిసారి డేటింగ్‌కు వెళ్లగా, అమ్మాయి అంద విహీనంగా ఉండటంతో అక్కడ నుంచి పారిపోయానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.